Oct 05, 2024, 08:10 IST/
ఒంటినిండా గాయాలతో పొలంలో శవమై కనిపించిన 11 ఏళ్ల బాలిక
Oct 05, 2024, 08:10 IST
బెంగాల్లో మరో ఘోరం చోటుచేసుకుంది. బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున ఓ పొలంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటినిండా గాయాలు ఉండటంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.