ఢిల్లీకి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు తన తండ్రితో గొడవపడి ఆవేశంలో షేవింగ్ రేజర్ మింగాడు. అయితే ఆ యువకుడు ముందు నుంచే డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బ్లేడ్ ఉండే హోల్డర్, హ్యాండిల్ను సదరు యువకుడు మింగాడు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి రేజర్ భాగాలను బయటకు తీశారు. శారీరకంగా కోలుకున్న అనంతరం అతడిని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కౌన్సిలింగ్‌కు పంపారు.