మహిళ దారుణ హత్య
సైదాపురం మండలం గంగదేవిపల్లిలో ఓ వివాహిత మంగళవారం దారుణ హత్యకు గురైంది. గంగదేవిపల్లిలో లావణ్య, మునేంద్ర దంపతులు జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే లావణ్యను ఆమె భర్త మునేంద్ర గొంతు కోసి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.