హర్యానా సోనిపట్‌లో తనతో సహజీవనం చేస్తున్న మహిళని కత్తితో పొడిచి చంపి, ఆమె శరీరానికి నిప్పు పెట్టిన ఉప్కార్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యను అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ఇల్లు మొత్తాన్ని నిందితుడు తగలబెట్టాడని, ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతురాలి శరీరంపై కత్తిపోట్లు గుర్తించడంతో విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. వివాహితుడైన ఉప్కార్ గత 6 ఏళ్లుగా సరితతో సహజీవనం చేస్తున్నాడు.