తనను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై తాజాగా ఆర్జీవీ స్పందించారు. నేను ఏడవడం లేదు... భయపడటం లేదన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అన్నారు. నేను ట్వీట్స్ పెట్టినవారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను అని ఆయన చెప్పుకొచ్చారు.