ప్రజలు ఎవ్వరు బయటకి రావద్దు : సంగం సీఐ
తుపాను నేపథ్యంలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హేచ్చరించడంతో సంగం మండలం, చేజర్ల మండలం, ఎఎస్ పేట మండల ప్రజలు అత్యవసరం తప్పితే ఎవరు బయటకి రావద్దు అనీ సీఐ వేమారెడ్డి తెలిపారు. ప్రమాదకర భవనాలు, చెట్లు ఒరిగిన, విద్యుత్ స్థంబాల వద్ద ఉండరాదని తెలిపారు. మీ గ్రామాలలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే 9154305605 నెంబర్ సంప్రదించాలన్నారు.