రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రేషన్ సరుకుల డోర్ డెలివరీకి సంబంధించి దొరవారిసత్రం మండలానికి కేటాయించిన ఏడు మినీ వాహనాలు మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. వాహన లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చిన అనంతరం వాహనాలను అప్పగిస్తామని మండల విస్తరణ అధికారి శ్రీనివాసులు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఈ డోర్ డెలివరీ వాహనాలు నిలుపుదల చేసి ఉండటంతో వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు.