సీతారామపురం మండలంలోని నెమళ్లదిన్నె గ్రామ సచివాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రింటర్ కాలిపోవడంతో సచివాలయ పరిధిలోని ఇద్దరు సర్పంచ్ ల దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించి వారి సొంతనిధులతో ఒక కొత్త ప్రింటర్ ని సచివాలయానికి కొనివ్వడం జరిగింది. ఇందుకు సహకరించిన రాగి సుబ్బయ్య జిల్లా యానది సంగం అధ్యక్షులు, జయపురం పంచాయతీ సర్పంచ్ పి.శ్రీలక్ష్మి, నెమళ్ళదిన్నె గ్రామ పంచాయతీ సర్పంచ్ తోకల రామచంద్రకు సచివాలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఇలా గ్రామపెద్దలు, గ్రామస్థులు సహకారం ఉంటే ఇంకా ఉత్తమమైన సేవలనదిస్తామని సచ్చివాలయం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.