నివర్ తుఫాన్ కారణంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... నివర్ తుపాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా మినుము, వరి, అలసంద , పెసర వంటి మొదలగు పంటలు బాగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
అదేవిధంగా నివర్ తుఫాన్ కారణంగా ముగ జంతువులు గొర్రెలు, మేకలు, పశువులు చనిపోయిన పరిస్థితి ఉందని వారికి ప్రభుత్వం ధ్వారా ఆర్ధిక సహాయం చేయాలని వారు కోరారు. ఉదయగిరి నియోజకవర్గంలోని చేరువులకు ప్రభుత్వం మరమ్మతులు చేయని కారణంగా చెరువులు నీటితో నిండి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని నిండిన చెరువులను అధికారులు పరిశీలించి చెరువులు తెగిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా రహదారులు కూడా చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్న పరిస్థితి ఉందని వెంటనే దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని వారు ప్రభుత్వన్ని కోరారు.