Mar 02, 2025, 09:03 IST/
సెమీస్‌లో ఆసీస్‌తోనే భారత్ ఆడాలి: సునీల్ గావస్కర్
Mar 02, 2025, 09:03 IST
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధమైంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనుంది. ఓడిన టీమ్ మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. అయితే, కివీస్‌పై టీమ్ఇండియా గెలిచి.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. సెమీస్‌లో ఆసీస్‌తోనే భారత్ ఆడాలని కోరుకుంటున్నానని తెలిపారు.