AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే రూ.1000 ఫైన్ విధిస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే రూ.1000 ఫైన్ వేస్తారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి రూ.10 వేల జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారికి రూ.5 వేల జరిమానా విధిస్తారు.