AP: విశాఖలోని రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ సర్టిఫికెట్ అందించింది. అయితే బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోవడం, దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా తయారుకావడం, నడక మార్గాలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన కొందరు ఫోటోలతో ఎఫ్ఈ సంస్థకు ఫిర్యాదు చేయడంతో గుర్తింపు రద్దు అయింది.