అర్హులు దరఖాస్తు చేసుకోండి: మంత్రి అనగాని

81చూసినవారు
అర్హులు దరఖాస్తు చేసుకోండి: మంత్రి అనగాని
AP: రాష్ట్రవ్యాప్తంగా 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ అందజేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 34.37 లక్షల కుటుంబాల డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వెల్లడించారు. స్కూళ్లు, కళాశాలల్లో ప్రవేశాలు, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతాయన్నారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాలు, ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్