AP: వైసీపీ శ్రేణులను నమ్మి ఎలాంటి సాయం చేయొద్దని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. నాయకుడికి, మోసగాడికి ఉన్న తేడా ఇదేనంటూ విమర్శించింది. పథకాలు, ప్రాజెక్టుల విషయంలో జగన్ ఘంటాపథంగా ఉండేవారని తెలిపింది. చంద్రబాబు తన పార్టీ వాళ్లకే పనులు చేయాలని చెబుతున్నారని, వైసీపీ వారికి ఇవ్వొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెబుతున్నారని పేర్కొంది.