మహిళా కానిస్టేబుల్‌కు అసభ్య సందేశాలు.. సీఐ సస్పెండ్

59చూసినవారు
మహిళా కానిస్టేబుల్‌కు అసభ్య సందేశాలు.. సీఐ సస్పెండ్
ఏపీలోని గుంటూరులో మహిళా కానిస్టేబుల్‌కు అసభ్య సందేశాలు పంపిన సీఐ జగన్మోహన్‌రావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. అసభ్య సందేశాలతో మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ను వేధించారని ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా సీఐ జగన్మోహనరావును సస్పెండ్‌ చేస్తూ ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన సీఐ ప్రస్తుతం గుంటూరు రేంజ్‌ పరిధిలో వీఆర్‌లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్