గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఆండ్ర గ్రామంలో గురువారం నిర్వహించిన దాడిలో నాలుగు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ ఎస్. ఐలు ఎన్. కొండలరావు, పి నరేంద్ర కుమార్ లు తెలిపారు. నాటు సారాతో పట్టుబడిన జాము సత్యవతి అనే మహిళపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో హెచ్. సి లు భాష, లోకాభి, సిబ్బంది అప్పారావు ఫాతిమాబేగం పాల్గొన్నారు.