పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పీ మాధవరెడ్డి అధ్యక్షతన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి ఎమ్మెల్యే విజయచంద్ర అమరవీరుల కుటుంబాలకు సత్కరించారు.