ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం.. ఎప్పటినుంచంటే?
AP: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.