స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి

55చూసినవారు
స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి
AP: నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనంతసాగరం గ్రామానికి చెందిన గోగినేని శ్రీకాంత్-నాగమణి దంపతులకు భార్గవ్, మోక్షజ్ఞ (2) ఇద్దరు కుమారులు. భార్గవ్ కందుకూరులోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. రోజులాగే భార్గవ్‌ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో పాటే వెళ్లిన మోక్షజ్ఞ వాహనం టైరు కింద పడి నలిగిపోయాడు. కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

సంబంధిత పోస్ట్