సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ సీఎం రేవంత్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టారని తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సహా పలువురి ఫిర్యాదు మేరకు బన్నీ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి. కాగా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ పలువురు ఫ్యాన్స్ సీఎం రేవంత్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.