జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్

82చూసినవారు
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్
జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళవారం జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. పవన్ పేరును ఎమ్మెల్యే నాదెండ్ల ప్రతిపాదించగా.. పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.