PNB: కస్టమర్లకు షాక్

85చూసినవారు
PNB: కస్టమర్లకు షాక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. నిధుల ఆధారిత రుణ రేటును స్వల్పంగా పెంచింది. అన్ని లోన్ టెన్యూర్లపై 0.05 శాతం అంటే 5 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో వాహన, వ్యక్తిగత రుణాలపై ఏడాది కాలపరిమితికి వడ్డీరేటు 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెరగనుంది. ఇక మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.20 శాతానికి చేరుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్