టీడీపీ ఆఫీస్‌లో పోలీసుల విచారణ?

65చూసినవారు
టీడీపీ ఆఫీస్‌లో పోలీసుల విచారణ?
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అల్లర్లు, దాడులపై ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సోమవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై 2021లో జరిగిన దాడి ఘటనపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైన పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you