తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. 'నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు' అని ఆయన వ్యాఖ్యానించారు.