మహిళపై దాడి కేసు నమోదు చేసిన ఎస్సై
వాహనాల పార్కింగ్ విషయంలో మహిళపై దాడి జరిగిన సంఘటన హనుమంతునిపాడు మండలంలోని రాజుగారిపల్లె గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గొట్టిముక్కల చంద్రమ్మ పై ఆమె ఇంటి పక్కన ఉండే మరో నలుగురు వాహనాలను పార్కింగ్ చేసుకునే విషయంలో ఘర్షణపడి దాడి చేయడంతో చంద్రమ్మకు గాయాలయ్యాయి. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమెను వివరాలు అడిగి కేసు నమోదు చేసుకుని ఎస్సై శివనాగరాజు దర్యాప్తు చేస్తున్నారు.