Apr 24, 2025, 07:04 IST/
యువకుడిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టిన పోలీసు (వీడియో)
Apr 24, 2025, 07:04 IST
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని ముంగ్రా బాద్షాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్చార్జ్ వినోద్ మిశ్రా ఒక యువకుడిని స్తంభానికి కట్టి, బెల్టుతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఎస్పీ డాక్టర్ కౌస్తుబ్.. వినోద్ మిశ్రాను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీచేశారు. అయితే యువకుడిని ఎందుకు కొట్టారో వివరాలు మాత్రం తెలియరాలేదు.