ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు
మార్కాపురం పట్టణంలో సోమవారం సాధన జూనియర్ కాలేజ్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సందేశం ఇస్తూ ఇంటర్మీడియట్ విద్య అనేది విద్యార్థుల కెరీర్ కు గేట్ వే వంటిదని, చాలా జాగ్రత్తగా తమ కెరీర్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, అతిధులు పాల్గొన్నారు.