గోల్ఫ్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు

57చూసినవారు
గోల్ఫ్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించడం గమనించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. నిందితుడు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు చెప్పారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్