పొదిలి సర్కిల్ పరిధిలో గంజాయి మరియు చోరీలకు పాల్పడుతున్న ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ నిందితులపై చాలా కేసులు ఉన్నట్లుగా మీడియాకు తెలిపారు. గంజాయి తరలింపు వంటి అంశంలో వీరిని అదుపులోకి తీసుకోగా చోరీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. గ్రా. 303 బంగారం, గ్రా. గంజాయిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.