మార్కాపురం: ఫోటోతో హెచ్చరించడానికి డిఎస్పి నాగరాజు
మార్కాపురం డిఎస్పి నాగరాజు బుధవారం కనుమ పండుగ రోజు పురస్కరించుకొని వాహనదారులను హెచ్చరించారు. అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దు అని వాహనదారులను కోరారు. వాహనదారులను హెచ్చరిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక ఫోటోను విడుదల చేశారు. 100 దాటితే 108 ఎక్కుతావు అని వాహనదారులకు హితబోధ చేశారు. మార్కాపురం డివిజన్ పరిధిలో ఈరోజు ప్రత్యేకంగా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.