మార్కాపురం: దారి ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి
ప్రకాశం జిల్లా పొదిలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సతార్‌పై ప్రైవేట్ బస్సు డ్రైవర్లు దాడి చేశారు. ప్రైవేట్ బస్సులకు ఆర్టీసీ బస్సు దారి ఇవ్వలేదని దాడి చేసినట్లు సమాచారం. హైదరాబాద్ వెళ్తుండగా వినుకొండ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.