ద్విచక్ర వాహనం అదుపుతప్పటంతో ఇద్దరికి తీవ్ర గాయాలు
పొదిలి మండలం మల్లవరం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. తీవ్రంగా గాయపడిన యువకులు పొదిలిలోని పెద్ద బస్టాండ్ వద్ద గల మగ్గం వర్క్ షాప్ లో పనిచేసే నిషాల్, తోఫోన్ లుగా స్థానికులు గుర్తించారు. గాయపడిన యువకులకు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఒంగోలు రిమ్స్ కు తరలించారు.