పొదిలి: పంట పొలాలు పరిశీలించిన మంత్రి

69చూసినవారు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కొండాయపాలెంలో శనివారం అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల పొలాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని మంత్రి స్వామి అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్