టంగుటూరులో: కేజీ పొగాకు ధర రూ. 222. 71
ప్రకాశం జిల్లా టంగుటూరు స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం జరిగిన పొగాకు సరాసరి ధర రూ. 222. 71 అత్యధిక ధర పలికింది. మండలంలోని జమ్మలపాలెం, తుమాడు, కె. ఉప్పలపాడు గ్రామాలలోని రైతులకు చెందిన 607 పొగాకు బేళ్లను కొనుగోలు చేసినట్లుగా వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 153 పొగాకు బేళ్లను తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. వేలంలో మొత్తం 46 మంది రైతులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.