పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, ఆరుగురు అరెస్ట్
టంగుటూరు మండలంలోని పొందూరులో పేకాట శిబిరంపై ఎస్ఐ నాగమల్లేశ్వరరావు సోమవారం తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 11, 138 నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచునున్నట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను గురించి సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.