జార్ఖండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3 గా నమోదు

78చూసినవారు
జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. రాష్ట్ర రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌లో శనివారం ఉదయం 9.20 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఖర్పావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, స్వల్పంగా ఆస్తి నష్టం జరిగనట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్