ఫలితాలెలా ఉన్నా సంయమనం పాటించాలి

52చూసినవారు
ఫలితాలెలా ఉన్నా సంయమనం పాటించాలి
ఏపీ ఎన్నికల్లో ఫలితాల తరువాత నాయకులు గెలుపోటముల్లో భావోద్వేగాలను నియంత్రించుకుని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలకు పోలీసులు సూచిస్తున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు కూడా సహకరించాలని కోరారు. ఫలితాల రోజు ర్యాలీలు, సంబరాలు, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉందన్నారు. నాయకులెవరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆదేశించారు.