హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్

62చూసినవారు
హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్
క్రికెటర్ విరాట్ కోహ్లీకి వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది 'వన్ 8 కమ్యూన్' రెస్టారెంట్ నెట్‌వర్క్. బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా మరియు ఢిల్లీలో ఈ రెస్టారెంట్లు ఇప్పటికే ఏర్పాటవగా, ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభించబడింది. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో ఇవాళ ప్రారంభించినట్లు విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. మీలో విరాట్ రెస్టారెంట్ కి ఎవరు వెళ్తారో కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్