ఏపీ సీఎం చంద్రబాబు నేడు రుషికొండను భవనాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ భవనాల డ్రోన్ వీడియో ఒకటి వైరల్గా మారింది. వైసీపీ ప్రభుత్వం 7 బ్లాకుల్లో రూ.500 కోట్లకు పైగా ఖర్చుతో ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించింది. భవనాల లోపల అత్యాధునిక ఫర్నిచర్, కళ్లు చెదిరేలా సౌకర్యాలను ఏర్పాటు చేసింది. అయితే నేడు చంద్రబాబు ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.