ముఖానికి, చర్మానికి ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడేవారికి అలర్ట్. ఫెయిర్‌నెస్ క్రీముల వాడకం వల్ల మనదేశంలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నట్లు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో వాడే పాదరసం కిడ్నీలకు హాని కలిగిస్తున్నట్లు కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది.ఫెయిర్‌నెస్ క్రీముల్లో ఉండే అధిక పాదరసం వల్ల కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిని ప్రోటీన్ లీకేజీకి కారణం అవుతుంది.