సీఎం చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. 'వినుకొండలో మా కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డులో దారుణంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్య.. ఇదేనా నువ్వు ప్రజలకు అందిస్తా అన్న సంక్షేమ పాలన? వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసి చోద్యం చూడ్డానికి సిగ్గుగా లేదా చంద్రబాబు?' అని కొడాలి నాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.