ఆక్రమణలకు గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని వినతిపత్రం

58చూసినవారు
ఆక్రమణలకు గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని వినతిపత్రం
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామపంచాయతీకి చెందిన పలువురు టిడిపి నాయకులు తహసిల్దార్ స్వప్నకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పల్లవోలు పంచాయతీ పరిధిలో ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకొని భూములు లేని వారికి ఇవ్వాలని వారు కోరారు. కొందరికి కనీసం ఒక సెంటు భూమి కూడా లేదని అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి భూములు అందజేయాలని కోరారు. తాసిల్దార్ సానుకూలంగా స్పందించారు.