దోసకాయ తెచ్చిన రగడ.. చెల్లిని చంపిన అన్న
కర్ణాటకలోని కొళ్లేగాల ఈద్గా మొహల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఫార్మాన్ తన అన్న కుమార్తెకు కీర దోస తినిస్తుండగా అతడి చెల్లి ఐమాన్ బాను అడ్డుకుంది. దోసకాయ తింటే జ్వరం వస్తుందని చెప్పింది. ఈ విషయమై జరిగిన గొడవలో చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రి సయ్యద్, వదిన తాజ్లపైనా కత్తి దూశాడు. తీవ్రంగా గాయపడిన ఐమాన్ భాను(26) మరణించింది. కొళ్లేగాల ఠాణా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.