AP: రాష్ట్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల 4కు పోస్ట్‌పోన్ అయింది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి లోకేశ్ ఈ పథకాన్ని ఆరంభించనున్నారు. 475 కాలేజీల్లో అమలయ్యే ఈ పథకానికి ప్రభుత్వం రూ.115 కోట్లు కేటాయించింది.