AP: కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉత్తర మండలం పొట్లపాలెంలోని మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముపై మైనింగ్ శాఖ కన్నేసింది. ఇప్పటికే ఆ శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ కొండారెడ్డి నేతృత్వంలోని బృందం గోదాము దగ్గరికి వెళ్లగా.. గేట్లు తీయడానికి కాపలాదారు నిరాకరించాడు. దాంతో అధికారులు నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు. కొద్ది రోజుల్లో గోదామును తనిఖీ చేస్తామని మైనింగ్ అధికారులు తెలిపారు.