రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలి బ్రిడ్జి సెంటర్ లో బుధవారం నిర్వహిస్తున్న రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పోలీసులు, విధ్యార్థులు, ఉపాధ్యాయులు, టిడిపి నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి - ప్రాణాలు కాపాడుకోవాలని, జాగ్రత్తలు పాటించండి సురక్షితంగా ఉండండి అని నినాదాలు చేశారు.