
కావలి: ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ప్రమాణస్వీకారం
ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. వాహన ప్రమాద సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా హెల్మెట్లను అందజేశారు. అసోసియేషన్ సభ్యుల కుటుంబాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మోమెంటోలు, గిఫ్టులు ఎమ్మెల్యే అందజేశారు.