కుంభమేళాకు వెళ్లే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్

56చూసినవారు
కుంభమేళాకు వెళ్లే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్
మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల కోసం రాజమండ్రి, కొవ్వూరు నుంచి స్పెషల్ బస్ స‌ర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ స్పెషల్ బస్సు ప్యాకేజీ ధ‌ర ఒక్కరికి (రానూ, పోనూ కలిపి) ఏడు రోజులకు గాను రూ.10 వేలుగా నిర్ణ‌యించినట్లు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 1న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కొవ్వొరు బ‌స్టాండ్ నుంచి బస్సు బ‌య‌లుదేరుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్