రాష్ట్రంలో పేద ప్రజలకు భూములపై న్యాయ పరమైన హక్కులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం నుండి రెవెన్యూ, భూముల రీ సర్వే పై రాష్ట్ర రెవెన్యూ మంత్రి జిల్లా కలెక్టర్ల లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ అంశాలపై ముఖ్య మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.