కొండాపురం: మేకల కాపరి అనుమానాస్పద మృతి

55చూసినవారు
కొండాపురం: మేకల కాపరి అనుమానాస్పద మృతి
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంట అటవీ ప్రాంతంలో మేకల కాపరి బంక తిరుపాలు బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. మేకలు కాసేందుకు అడవికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అడవిలో గాలింపు చేపట్టడంతో మృతదేహం కనిపించింది. మెడకు బైకు ఎక్సలేటర్ వైర్ బిగించి ఉండడంతో అనుమానంతో పోలీసులకు పిర్యాదు చేశారు. మేకల దొంగతనం కోసం దుండగులు హత్య చేశారంటూ గ్రామస్తులు ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్